Lev 25:1 మరియు యెహోవా సీనాయికొండమీద మోషేకు ఈలాగు సెలవిచ్చెను
Lev 25:2 నీవు ఇశ్రాయేలీయులతో ఇట్ల నుమునేను మీకిచ్చుచున్న దేశములోనికి మీరు వచ్చిన తరువాత ఆ భూమికూడ యెహోవా పేరట విశ్రాంతి కాలమును, ఆచరింపవలెను.
Lev 25:3 ఆరు సంవత్సరములు నీ చేను విత్తవలెను. ఆరు సంవత్సరములు నీ ఫలవృక్ష ములతోటను బద్దించి దాని ఫలములను కూర్చుకొనవచ్చును.
Lev 25:4 ఏడవ సంవత్సరము భూమికి మహా విశ్రాంతి కాలము, అనగా యెహోవా పేరట విశ్రాంతి సంవత్సరముగా ఉండవలెను. అందులో నీ చేను విత్త కూడదు; నీ ఫలవృక్షములతోటను శుద్ధిపరచకూడదు.
Lev 25:5 నీ కారుచేల పంటను కోసికొనకూడదు, శుద్ధిపరచని నీ వృక్షఫలములను ఏరుకొనకూడదు; అది భూమికి విశ్రాంతి సంవత్సరము.
Lev 25:6 అప్పుడు భూమి యొక్క విశ్రాంతి సంవత్సర సస్యము నీకును నీ దాసునికిని నీ దాసికిని నీ జీతగానికిని నీతో నివ సించు పరదేశికిని ఆహారమగును.
Lev 25:7 మరియు నీ పశువుల కును నీ దేశజంతువులకును దాని పంట అంతయు మేతగా ఉండును.
Lev 25:8 మరియు ఏడు విశ్రాంతి సంవత్సరములను, అనగా ఏడేసి యేండ్లుగల సంవత్సరములను లెక్కింపవలెను. ఆ యేడు విశ్రాంతి సంవత్సరములకాలము నలుబది తొమ్మిది సంవత్సరములగును.
Lev 25:9 ఏడవ నెల పది యవనాడు మీ స్వదేశమంతట శృంగనాదము చేయవలెను. ప్రాయశ్చి త్తార్థదినమున మీ దేశమంతట ఆ శృంగనాదము చేయవలెను.
Lev 25:10 మీరు ఆ సంవత్సరమును, అనగా ఏబదియవ సంవత్స రమును పరిశుద్ధపరచి మీ దేశవాసులకందరికి విడుదల కలిగినదని చాటింపవలెను; అది మీకు సునాదముగా నుండును; అప్పుడు మీలో ప్రతివాడు తన స్వాస్థ్యమును తిరిగి పొందవలెను; ప్రతివాడు తన కుటుంబమునకు తిరిగి రావలెను.
Lev 25:11 ఆ సంవత్సరము, అనగా ఏబదియవ సంవత్స రము మీకు సునాదకాలము. అందులో మీరు విత్త కూడదు కారుపంటను కోయకూడదు శుద్ధిపరచని నీ ఫల వృక్షముల పండ్లను ఏరుకొనకూడదు.
Lev 25:12 అది సునాద కాలము; అది మీకు పరిశుద్ధమగును, పొలములో దానంతట అదే పండిన పంటను మీరు తినెదరు.
Lev 25:13 ఆ సునాద సంవ త్సరమున మీలో ప్రతివాడు తన స్వాస్థ్యమును మరల పొందవలెను.
Lev 25:14 నీవు నీ పొరుగువానికి వెలకు ఇచ్చిన దేని విషయములోకాని నీ పొరుగువాని దగ్గర నీవు కొనిన దేని విషయములో కాని మీరు ఒకరినొకరు బాధింపకూడదు.
Lev 25:15 సునాద సంవత్సరమైన తరువాత గడచిన యేండ్ల లెక్క చొప్పున నీ పొరుగు వానియొద్ద నీవు దానిని కొనవలెను. పంటల లెక్కచొప్పున అతడు నీకు దానిని అమ్మవలెను.
Lev 25:16 ఆ సంవత్సరముల లెక్క హెచ్చినకొలది దాని వెల హెచ్చింపవలెను, ఆ సంవత్సరముల లెక్క తగ్గినకొలది దాని వెల తగ్గింపవలెను. ఏలయనగా పంటల లెక్కచొప్పున అతడు దాని నీకు అమ్మును గదా.
Lev 25:17 మీరు ఒకరి నొకరు బాధింపక నీ దేవునికి భయపడవలెను. నేను మీ దేవుడనైన యెహోవాను.
Lev 25:18 కాబట్టి మీరు నా కట్టడలను నా విధులను గైకొని వాటి ననుసరించి నడుచుకొనవలెను.
Lev 25:19 అప్పుడు మీరు ఆ దేశములో సురక్షితముగా నివసించె దరు, ఆ భూమి ఫలించును. మీరు తృప్తిగా భుజించి దానిలో సురక్షితముగా నివసించెదరు.
Lev 25:20 ఏడవ యేట మేము ఏమి తిందుము? ఇదిగో మేము చల్లను పంటకూర్చను వల్లగాదే అనుకొందురేమో.
Lev 25:21 అయితే నేను ఆరవయేట నా దీవెన మీకు కలుగునట్లు ఆజ్ఞాపించెదను; అది మూడేండ్ల పంటను మీకు కలుగజేయును.
Lev 25:22 మీరు ఎనిమిదవ సంవత్స రమున విత్తనములు విత్తి తొమ్మిదవ సంవత్సరమువరకు పాత పంట తినెదరు; దాని పంటను కూర్చువరకు పాత దానిని తినెదరు.
Lev 25:23 భూమిని శాశ్వత విక్రయము చేయకూడదు. ఆ భూమి నాదే, మీరు నాయొద్ద కాపురమున్న పరదేశులు.
Lev 25:24 మీ స్వాస్థ్యమైన ప్రతి పొలము మరల విడిపింపబడు నట్లుగా దాని అమ్ముకొనవలెను.
Lev 25:25 నీ సహోదరుడు బీదవాడై తన స్వాస్థ్యములో కొంత అమ్మిన తరువాత అతనికి సమీప బంధువుడు విడిపింప వచ్చినయెడల తన సహోదరుడు అమ్మినదానిని అతడు విడి పించును.
Lev 25:26 అయితే ఒకడు సమీప బంధువుడు లేకయే దాని విడిపించుకొనుటకు కావలసిన సొమ్ము సంపాదించిన యెడల
Lev 25:27 దానిని అమ్మినది మొదలుకొని గడచిన సంవత్సరములు లెక్కించి యెవరికి దానిని అమ్మెనో వారికి ఆ శేషము మరల ఇచ్చి తన స్వాస్థ్యమును పొందును.
Lev 25:28 అతనికి దాని రాబట్టుకొనుటకై కావలసిన సొమ్ము దొరకని యెడల అతడు అమ్మిన సొత్తు సునాదసంవత్సరమువరకు కొనిన వాని వశములో ఉండవలెను. సునాదసంవత్సరమున అది తొలగిపోవును; అప్పుడతడు తన స్వాస్థ్యమును మరల నొందును.
Lev 25:29 ఒకడు ప్రాకారముగల ఊరిలోని నివాసగృహమును అమ్మినయెడల దాని అమ్మినదినము మొదలుకొని నిండు సంవత్సరములోగా దాని విడిపింపవచ్చును; ఆ సంవత్సర దినములోనే దాని విడిపించుకొనవచ్చును.
Lev 25:30 అయితే ఆ సంవత్సరదినములు నిండకమునుపు దాని విడిపింపనియెడల ప్రాకారముగల ఊరిలోనున్న ఆ యిల్లు కొనినవానికి వాని తరతరములకు అది స్థిరముగానుండును. అది సునాద కాలమున తొలగిపోదు.
Lev 25:31 చుట్టును ప్రాకారములులేని గ్రామములలోని యిండ్లను వెలిపొలములుగా ఎంచవలెను. అవి విడుదల కావచ్చును; అవి సునాదకాలములో తొలగి పోవును.
Lev 25:32 అయితే లేవీయుల పట్టణములు, అనగా వారి స్వాధీన పట్టణములలోని యిండ్లను విడిపించుటకు అధి కారము లేవీయులకు శాశ్వతముగా ఉండును.
Lev 25:33 లేవీయుల పట్టణముల యిండ్లు ఇశ్రాయేలీయుల మధ్యనున్న వారి స్వాస్థ్యము గనుక ఒకడు లేవీయులయొద్ద ఇల్లు సంపా దించిన యెడల పిత్రార్జిత పట్టణములో అమ్మబడిన ఆ యిల్లు సునాదసంవత్సరమున తొలగిపోవును.
Lev 25:34 వారు తమ పట్టణ ముల ప్రాంతభూములను అమ్ముకొనకూడదు; అవి వారికి శాశ్వత స్వాస్థ్యము.
Lev 25:35 పరవాసియైనను అతిథియైనను నీ సహోదరుడొకడు బీదవాడై నిరాధారుడై నీయొద్దకు వచ్చినయెడల నీవు వానికి సహాయము చేయవలెను; అతడు నీవలన బ్రదుక వలెను.
Lev 25:36 నీ దేవునికి భయపడి వానియొద్ద వడ్డినైనను తీసి కొనకూడదు; నీ సహోదరుడు నీవలన బ్రదుకవలెను.
Lev 25:37 నీ రూకలు వానికి వడ్డికియ్యకూడదు; నీ ఆహారమును వానికి లాభమున కియ్యకూడదు.
Lev 25:38 నేను మీకు కనాను దేశమునిచ్చి మీకు దేవుడగునట్లు ఐగుప్తుదేశములోనుండి మిమ్మును రప్పించిన మీ దేవుడనైన యెహోవాను.
Lev 25:39 నీయొద్ద నివసించు నీ సహోదరుడు బీదవాడై నీకు అమ్మబడినయెడల వానిచేత బానిససేవ చేయించుకొన కూడదు.
Lev 25:40 వాడు జీతగానివలెను పరవాసివలెను నీయొద్ద నివసించు సునాదసంవత్సరమువరకు నీ యొద్ద దాసుడుగా ఉండవలెను.
Lev 25:41 అప్పుడతడు తన పితరుల స్వాస్థ్యమును మరల అనుభవించునట్లు తన పిల్లలతో కూడ నీయొద్దనుండి బయలుదేరి తన వంశస్థులయొద్దకు తిరిగి వెళ్లవలెను.
Lev 25:42 ఏల యనగా వారు నాకే దాసులైయున్నారు, నేను ఐగుప్తులో నుండి వారిని రప్పించితిని; దాసులను అమ్మినట్లు వారిని అమ్మకూడదు;
Lev 25:43 నీ దేవునికి భయపడి అట్టివానిని కఠిన ముగా చూడకుము.
Lev 25:44 మీ చుట్టుపట్లనున్న జనములలో నుండి దాసీలను దాసులను కొనవచ్చును.
Lev 25:45 మరియు మీ మధ్య నివసించు పరదేశులను నీ దేశములో వారికి పుట్టిన వారిని కొనవచ్చును; వారు మీ సొత్తగుదురు.
Lev 25:46 మీ తరు వాత మీ సంతతివారికి స్వాస్థ్యముగా ఉండునట్లు మీరు ఇట్టివారిని స్వతంత్రించుకొనవచ్చును; వారు శాశ్వతముగా మీకు దాసులగుదురు కాని, ఇశ్రాయేలీయులైన మీరు సహోదరులు గనుక ఒకని చేత ఒకడు కఠినసేవ చేయించు కొనకూడదు.
Lev 25:47 పరదేశియేగాని నీయొద్ద నివసించువాడేగాని ధనసంపా దనము చేసికొనునప్పుడు అతనియొద్ద నివసించు నీ సహోదరుడు బీదవాడై నీయొద్ద నివసించు ఆ పరదేశికైనను ఆ పరదేశి కుటుంబములో వేరొకని కైనను తన్ను అమ్ముకొనిన యెడల
Lev 25:48 తన్ను అమ్ము కొనిన తరువాత వానికి విడుదల కావచ్చును. వాని సహోదరులలో ఒకడు వానిని విడి పింపవచ్చును.
Lev 25:49 వాని పినతండ్రియేగాని పినతండ్రి కుమా రుడేగాని వాని వంశములో వాని రక్తసంబంధియేగాని వాని విడిపింపవచ్చును. కావలసిన క్రయధనము వానికి దొరికిన యెడల తన్ను తాను విడిపించుకొనవచ్చును.
Lev 25:50 అప్పుడు వాడు అమ్మబడిన సంవత్సరము మొదలు కొని సునాద సంవత్సరమువరకు తన్ను కొనినవానితో లెక్కచూచుకొన వలెను. వాని క్రయధనము ఆ సంవత్సరముల లెక్కచొప్పున ఉండవలెను. తాను జీతగాడైయుండిన దినముల కొలది ఆ క్రయధనమును తగ్గింపవలెను.
Lev 25:51 ఇంక అనేక సంవత్సరములు మిగిలి యుండినయెడల వాటినిబట్టి తన్ను అమ్మిన సొమ్ములో తన విమోచన క్రయధనమును మరల ఇయ్యవలెను.
Lev 25:52 సునాద సంవత్సరమునకు కొన్ని సంవత్సరములే తక్కువైన యెడల అతనితో లెక్క చూచుకొని సంవత్సరముల లెక్కచొప్పున తన విమోచనక్రయధనమును అతనికి చెల్లింపవలెను.
Lev 25:53 ఏటేటికి జీతగానివలె వాడతనియొద్ద ఉండవలెను. అతడు మీ కన్నులయెదుట వానిచేత కఠినముగా సేవ చేయించకూడదు.
Lev 25:54 అతడు ఈ రీతిగా విడిపింపబడనియెడల సునాదసంవత్సరమున వాడు తన పిల్లలతో కూడ విడుదలనొందును.
Lev 25:55 ఏలయనగా ఇశ్రాయేలీయులు నాకే దాసులు; నేను ఐగుప్తుదేశములో నుండి రప్పించిన నా దాసులే. నేను మీ దేవుడనైన యెహోవాను.

No comments:
Post a Comment