Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Thursday, October 10, 2013

లేవీయకాండము 2

Lev 2:1  ఒకడు యెహోవాకు నైవేద్యము చేయునప్పుడు అతడు అర్పించునది గోధుమపిండిదై యుండవలెను. అతడు దానిమీద నూనెపోసి సాంబ్రాణి వేసి
Lev 2:2  యాజకులగు అహరోను కుమారులయొద్దకు దానిని తేవలెను. అందులో నుండి యాజకుడు తన చేరతో చేరెడు నూనెయు చేరెడు గోధుమపిండియు దాని సాంబ్రాణి అంతయు తీసికొని యెహోవాకు ఇంపైన సువాసనగల హోమముగా బలి పీఠముమీద అందులో ఒక భాగమును జ్ఞాపకార్థముగా దహింపవలెను.
Lev 2:3  ఆ నైవేద్య శేషము అహరోనుకును అతని కుమారులకును ఉండును. యెహోవాకు అర్పించు హోమ ములలో అది అతిపరిశుద్ధము.
Lev 2:4  నీవు పొయ్యిలో కాల్చిన నైవేద్యము చేయునప్పుడు అది నూనె కలిసినదియు, పొంగనిదియునైన గోధుమపిండి అప్పడములే గాని నూనె రాచినదియు పొంగనిదియునైన పూరీలేగాని కావలెను.
Lev 2:5  నీ అర్పణము పెనముమీద కాల్చిన నైవేద్యమైనయెడల అది నూనె కలిసినదియు పొంగనిదియునైన గోధుమపిండిదై యుండవలెను.
Lev 2:6  అది నైవేద్యము గనుక నీవు దాని ముక్కలుగా త్రుంచి వాటి మీద నూనె పోయవలెను.
Lev 2:7  నీవు అర్పించునది కుండలో వండిన నైవేద్యమైన యెడల నూనె కలిసిన గోధుమపిండితో దానిని చేయవలెను.
Lev 2:8  వాటితో చేయబడిన నైవేద్యమును యెహోవాయొద్దకు తేవలెను. యాజకునియొద్దకు దానిని తెచ్చిన తరువాత అతడు బలిపీఠము దగ్గరకు దానిని తేవలెను
Lev 2:9  అప్పుడు యాజకుడు ఆ నైవేద్యములో ఒక భాగమును జ్ఞాప కార్థముగా తీసి బలిపీఠముమీద యెహోవాకు ఇంపైన సువాసనగల హోమముగా దాని దహింపవలెను.
Lev 2:10  ఆ నైవేద్య శేషము అహరోనుకును అతని కుమారులకును జెందును. యెహోవాకు అర్పించు హోమములలో అది అతిపరిశుద్ధము.
Lev 2:11  మీరు యెహోవాకు చేయు నైవేద్యమేదియు పులిసి పొంగినదానితో చేయకూడదు. ఏలయనగా పులిసినదైనను తేనెయైనను యెహోవాకు హోమముగా దహింపవలదు.
Lev 2:12  ప్రథమఫలముగా యెహోవాకు వాటిని అర్పింపవచ్చును గాని బలిపీఠముమీద ఇంపైన సువాసనగా వాటి నర్పింప వలదు.
Lev 2:13  నీవు అర్పించు ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చ వలెను. నీ దేవుని నిబంధనయొక్క ఉప్పు నీ నైవేద్యము మీద ఉండవలెను, నీ అర్పణములన్నిటితోను ఉప్పు అర్పింపవలెను.
Lev 2:14  నీవు యెహోవాకు ప్రథమఫలముల నైవేద్య మును చేయు నప్పుడు సారమైన భూమిలో పుట్టిన పచ్చని వెన్నులలోని ఊచబియ్యమును వేయించి విసిరి నీ ప్రథమఫలముల నైవేద్యముగా అర్పింపవలెను.
Lev 2:15  అది నైవేద్యరూప మైనది, నీవు దానిమీద నూనెపోసి దాని పైని సాంబ్రాణి వేయవలెను.
Lev 2:16  అందులో జ్ఞాపకార్థమైన భాగమును, అనగా విసిరిన ధాన్యములో కొంతయు, నూనెలో కొంతయు, దాని సాంబ్రాణి అంతయు యాజ కుడు దహింపవలెను. అది యెహోవాకు హోమము.

No comments:

Post a Comment