Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Thursday, October 10, 2013

లేవీయకాండము 14

Lev 14:1  మరియు యెహోవా మోషేకు ఈలాగు సెల విచ్చెను
Lev 14:2  కుష్ఠరోగి పవిత్రుడని నిర్ణయించిన దినమున వానిగూర్చిన విధి యేదనగా, యాజకుని యొద్దకు వానిని తీసికొని రావలెను.
Lev 14:3  యాజకుడు పాళెము వెలుపలికి పోవలెను. యాజకుడు వానిని చూచినప్పుడు కుష్ఠుపొడ బాగుపడి కుష్ఠరోగిని విడిచిన యెడల
Lev 14:4  యాజకుడు పవి త్రత పొంద గోరువాని కొరకు సజీవమైన రెండు పవిత్రపక్షులను దేవదారు కఱ్ఱను రక్తవర్ణముగల నూలును హిస్సో పును తెమ్మని ఆజ్ఞాపింపవలెను.
Lev 14:5  అప్పుడు యాజకుడు పారు నీటిపైని మంటిపాత్రలో ఆ పక్షులలో ఒకదానిని చంప నాజ్ఞాపించి
Lev 14:6  సజీవమైన పక్షిని ఆ దేవదారు కఱ్ఱను రక్తవర్ణముగల నూలును హిస్సోపును తీసికొని పారు నీటి పైని చంపిన పక్షిరక్తములో వాటిని సజీవమైన పక్షిని ముంచి
Lev 14:7  కుష్ఠు విషయములో పవిత్రత పొందగోరు వాని మీద ఏడుమారులు ప్రోక్షించి వాడు పవిత్రుడని నిర్ణ యించి సజీవమైన పక్షి ఎగిరిపోవునట్లు దానిని వదిలివేయ వలెను.
Lev 14:8  అప్పుడు పవిత్రత పొందగోరు వాడు తన బట్టలు ఉదుకుకొని తన రోమమంతటిని క్షౌరము చేసికొని నీళ్లతో స్నానముచేసి పవిత్రుడగును. తరువాత వాడు పాళెములోనికి వచ్చి తన గుడారము వెలుపల ఏడు దినములు నివ సింపవలెను.
Lev 14:9  ఏడవనాడు తన రోమమంతటిని తన తలను తన గడ్డమును తన కనుబొమలను క్షౌరము చేసికొనవలెను. తన రోమ మంతటిని క్షౌరము చేసికొని బట్టలు ఉదుకుకొని యొడలు నీళ్లతో కడుగుకొని పవిత్రుడగును.
Lev 14:10  ఎనిమిదవ నాడు వాడు నిర్దోషమైన రెండు మగ గొఱ్ఱపిల్లలను నిర్దోషమైన యేడాది ఆడు గొఱ్ఱపిల్లను నైవేద్యమునకై నూనె కలిసిన మూడు పదియవ వంతుల గోధుమపిండిని ఒక అర్ధసేరు నూనెను తీసికొనిరావలెను.
Lev 14:11  పవిత్రపరచు యాజకుడు పవిత్రత పొందగోరు మనుష్యుని వాటితో ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమున యెహోవా సన్నిధికి తీసికొనిరావలెను.
Lev 14:12  అప్పుడు యాజకుడు ఒక మగ గొఱ్ఱపిల్లను అర్ధసేరు నూనెను తీసికొని అపరాధ పరిహారార్థబలిగా వాటిని దగ్గరకు తెచ్చి అల్లాడింపబడు అర్పణముగా యెహోవా సన్నిధిని వాటిని అల్లాడింప వలెను.
Lev 14:13  అతడు పాపపరి హారార్థబలి పశువును దహన బలిపశువును వధించు పరిశుద్ధస్థలములో ఆ గొఱ్ఱపిల్లను వధింపవలెను. పాప పరిహారార్థమైనదానివలె అపరాధపరి హారార్థ మైనదియు యాజకునిదగును; అది అతిపరిశుద్ధము.
Lev 14:14  అప్పుడు యాజకుడు అపరాధపరిహారార్థమైనదాని రక్త ములో కొంచెము తీసి పవిత్రత పొందగోరువాని కుడిచెవి కొనమీదను, వాని కుడిచేతి బొటనవ్రేలిమీదను, వాని కుడికాలి బొటనవ్రేలిమీదను, దానిని చమరవలెను.
Lev 14:15  మరియు యాజకుడు అర్ధసేరు నూనెలో కొంచెము తీసి తన యెడమ అరచేతిలో పోసికొనవలెను.
Lev 14:16  అప్పుడు యాజ కుడు తన యెడమ అరచేతిలోనున్న నూనెలో తన కుడిచేతి వ్రేలు ముంచి యెహోవా సన్నిధిని ఏడుమారులు తన వ్రేలితో ఆ నూనెలో కొంచెము ప్రోక్షింపవలెను.
Lev 14:17  యాజకుడు తన అరచేతిలోనున్న కొదువ నూనెలో కొంచెము తీసికొని పవిత్రత పొందగోరు వాని కుడిచెవి కొనమీదను, వాని కుడిచేతి బొటనవ్రేలిమీదను, వాని కుడికాలి బొటనవ్రేలిమీదను ఉన్న అపరాధపరిహారార్థ బలిపశువుయొక్క రక్తముమీద చమరవలెను.
Lev 14:18  అప్పుడు యాజకుడు తన అరచేతిలోనున్న కొదువ నూనెను పవిత్రత పొంద గోరువాని తలమీద చమరవలెను. అట్లు యాజ కుడు యెహోవా సన్నిధి వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను.
Lev 14:19  అప్పుడు యాజకుడు పాపపరిహారార్థబలి అర్పించి అపవిత్రత పోగొట్టుకొని పవిత్రత పొందగోరు వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసిన తరువాత వాడు దహనబలిపశువును వధింపవలెను.
Lev 14:20  యాజకుడు దహనబలి ద్రవ్యమును నైవేద్యమును బలిపీఠముమీద అర్పింపవలెను. అట్లు యాజకుడు వాని నిమిత్తము ప్రాయశ్చిత్తముచేయగా వాడు పవిత్రుడగును.
Lev 14:21  వాడు బీదవాడై పైచెప్పినదంతయు తేజాలని యెడల తన నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగుటకై వాడు అల్లా డించుటకు అపరాధపరిహారార్థబలిగా ఒక గొఱ్ఱపిల్లను నైవేద్యముగా తూములో పదియవవంతు నూనెతో కలిసిన గోధుమపిండిని ఒక అర్ధసేరు నూనెను
Lev 14:22  వారికి దొరకగల రెండు తెల్ల గువ్వలనేగాని రెండు పావురపు పిల్లలనేగాని, అనగా పాపపరిహారార్థ బలిగా ఒకదానిని దహనబలిగా ఒక దానిని తీసికొని రావలెను.
Lev 14:23  వాడు పవిత్రతపొంది ఎనిమిదవ నాడు యెహోవా సన్నిధికి ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునకు యాజకునియొద్దకు వాటిని తీసికొని రావలెను.
Lev 14:24  యాజకుడు అపరాధ పరిహారార్థబలియగు గొఱ్ఱపిల్లను అర్ధసేరు నూనెను తీసికొని అల్లాడించు అర్పణముగా యెహోవా సన్నిధిని వాటిని అల్లాడింపవలెను.
Lev 14:25  అప్పు డతడు అపరాధపరిహారార్థబలియగు గొఱ్ఱపిల్లను వధింప వలెను. యాజకుడు ఆ అపరాధ పరిహారార్థబలిపశువు యొక్క రక్తములో కొంచెము తీసికొని, పవిత్రత పొంద గోరువాని కుడిచెవి కొనమీదను, వాని కుడిచేతి బొటన వ్రేలిమీదను, వాని కుడికాలి బొటన వ్రేలిమీదను దానిని చమరవలెను.
Lev 14:26  మరియు యాజకుడు ఆ నూనెలో కొంచెము తన యెడమ అరచేతిలో పోసికొని
Lev 14:27  తన యెడమచేతిలో నున్న ఆ నూనెలో కొంచెము తన కుడివ్రేలితో యెహోవా సన్నిధిని ఏడు మారులు ప్రోక్షింపవలెను.
Lev 14:28  మరియు యాజకుడు తన అరచేతిలోనున్న నూనెలో కొంచెము పవిత్రత పొంద గోరువాని కుడిచెవి కొనమీదను, వాని కుడిచేతి బొటన వ్రేలిమీదను, వాని కుడికాలి బొటన వ్రేలిమీదను ఆ అపరాధ పరిహారార్థ బలిపశువుయొక్క రక్తమున్న చోటను వేయవలెను.
Lev 14:29  యాజకుని అరచేతిలో నున్న కొదువ నూనెను అతడు పవిత్రత పొందగోరువానికి యెహోవా సన్నిధిని ప్రాయశ్చిత్తము కలుగజేయుటకు వాని తలమీద పోయవలెను.
Lev 14:30  అప్పుడు వానికి దొరకగల ఆ తెల్లగువ్వలలోనేగాని పావురపుపిల్లలలోనేగాని ఒక దాని నర్పింపవలెను.
Lev 14:31  తన నైవేద్యము గాక వాటిలో తనకు దొరకగల పాపపరిహారార్థబలిగా ఒక దానిని దహనబలిగా ఒకదానిని అర్పింపవలెను. అట్లు యాజ కుడు పవిత్రత పొందగోరువాని నిమిత్తము యెహోవా సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయవలెను.
Lev 14:32  కుష్ఠుపొడ కలిగినవాడు పవిత్రత పొందతగినవాటిని సంపాదింపలేని యెడల వాని విషయమైన విధి యిదే.
Lev 14:33  మరియు యెహోవా మోషే అహరోనులకు ఈలాగు సెలవిచ్చెను
Lev 14:34  నేను స్వాస్థ్యముగా మీకిచ్చుచున్న దేశమునకు మీరు వచ్చినతరువాత, మీ స్వాస్థ్యమైన దేశములోని యే యింటనైనను నేను కుష్ఠుపొడ కలుగ జేసినయెడల
Lev 14:35  ఆ యింటి యజమా నుడు యాజకునియొద్దకు వచ్చినా యింటిలో కుష్ఠుపొడ వంటిది నాకు కనబడెనని అతనికి తెలియ చెప్పవలెను.
Lev 14:36  అప్పుడు ఆ యింటనున్నది యావత్తును అపవిత్రము కాకుండునట్లు, యాజకుడు ఆ కుష్ఠుపొడను చూచుటకు రాకమునుపు అతడు ఆ యిల్లు వట్టిదిగాచేయ నాజ్ఞాపింపవలెను. ఆ తరువాత యాజకుడు ఆ యిల్లు చూచుటకై లోపలికి వెళ్లవలెను.
Lev 14:37  అతడు పొడ చూచినప్పుడు ఆ పొడ యింటి గోడలయందు పచ్చ దాళుగానైనను ఎఱ్ఱదాళుగానైనను ఉండు పల్లపుచారలు గలదై గోడకంటె పల్లముగా ఉండిన యెడల
Lev 14:38  యాజ కుడు ఆ యింటనుండి యింటివాకిటికి బయలువెళ్లి ఆ యిల్లు ఏడు దినములు మూసి యుంచవలెను.
Lev 14:39  ఏడవనాడు యాజకుడు తిరిగి వచ్చి దానిని చూడవలెను. అప్పుడు ఆ పొడ యింటి గోడలయందు వ్యాపించినదైన యెడల
Lev 14:40  యాజకుని సెలవు చొప్పున ఆ పొడగల రాళ్లను ఊడదీసి ఊరి వెలుపలనున్న అపవిత్రస్థలమున పారవేయవలెను.
Lev 14:41  అప్పుడతడు ఆ యింటిలోపలను చుట్టు గోడలను గీయింప వలెను. వారు గీసిన పెల్లలను ఊరివెలుపలనున్న అపవిత్రస్థలమున పారబోసి
Lev 14:42  వేరురాళ్లను తీసికొని ఆ రాళ్లకు ప్రతిగా చేర్పవలెను. అతడు వేరు అడుసును తెప్పించి ఆ యింటిగోడకు పూయింపవలెను.
Lev 14:43  అతడు ఆ రాళ్లను ఊడదీయించి యిల్లుగీయించి దానికి అడుసును పూయించిన తరువాత ఆ పొడ తిరిగి ఆ యింట బయలు పడినయెడల యాజకుడు వచ్చి దాని చూడవలెను.
Lev 14:44  అప్పుడు ఆ పొడ ఆ యింట వ్యాపించినయెడల అది ఆ యింటిలో కొరు కుడు కుష్ఠము; అది అపవిత్రము.
Lev 14:45  కాబట్టి అతడు ఆ యింటిని దాని రాళ్లను కఱ్ఱలను సున్నమంతటిని పడ గొట్టించి ఊరివెలుపలనున్న అపవిత్రస్థలమునకు వాటిని మోయించి పారబోయింపవలెను.
Lev 14:46  మరియు ఆ యిల్లు పాడువిడిచిన దినములన్నియు దానిలో ప్రవేశించువాడు సాయంకాలమువరకు అపవిత్రుడగును.
Lev 14:47  ఆ యింట పండు కొనువాడు తన బట్టలు ఉదుకు కొనవలెను. ఆ యింట భోజనముచేయు వాడు తన బట్టలు ఉదుకుకొనవలెను.
Lev 14:48  యాజకుడు వచ్చి లోపల ప్రవేశించి చూచునప్పుడు ఆ యింటికి అడుసు వేసిన తరువాత ఆ పొడ యింటిలో వ్యాపింపక పోయినయెడల, పొడ బాగుపడెను గనుక ఆ యిల్లు పవిత్రమని యాజకుడు నిర్ణయింపవలెను.
Lev 14:49  ఆ యింటి కొరకు పాపపరిహారార్థబలి అర్పించుటకు అతడు రెండు పక్షులను దేవదారు కఱ్ఱను రక్తవర్ణపు నూలును హిస్సోపును తీసికొని
Lev 14:50  పారు నీటిపైన మంటి పాత్రలో ఆ పక్షులలో ఒకదానిని వధించి
Lev 14:51  ఆ దేవదారు కఱ్ఱను హిస్సోపును రక్తవర్ణపు నూలును సజీవమైన పక్షిని తీసికొని వధింపబడిన పక్షి రక్తములోను పారు నీటిలో వాటిని ముంచి ఆ యింటిమీద ఏడు మారులు ప్రోక్షింపవలెను.
Lev 14:52  అట్లు ఆ పక్షి రక్తముతోను ఆ పారు నీటితోను సజీవ మైన పక్షితోను దేవదారు కఱ్ఱతోను హిస్సోపుతోను రక్త వర్ణపు నూలుతోను ఆ యింటి విషయములో పాపపరి హారార్థబలి అర్పింపవలెను.
Lev 14:53  అప్పుడు సజీవమైన పక్షిని ఊరివెలుపల నెగర విడువవలెను. అట్లు అతడు ఆ యింటికి ప్రాయశ్చిత్తము చేయగా అది పవిత్రమగును.
Lev 14:54  ప్రతివిధమైన కుష్ఠుపొడను గూర్చియు, బొబ్బను గూర్చియు
Lev 14:55  వస్త్రకుష్ఠమునుగూర్చియు, వస్త్రమునకై నను ఇంటికైనను కలుగు కుష్ఠమునుగూర్చియు,
Lev 14:56  వాపును గూర్చియు, పక్కునుగూర్చియు, నిగనిగ లాడు మచ్చను గూర్చియు,
Lev 14:57  ఒకడు ఎప్పుడు అపవిత్రుడ గునో, యెప్పుడు పవిత్రుడగునో తెలియజేయుటకు ఇది కుష్ఠమును గూర్చిన విధి.

No comments:

Post a Comment