Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Thursday, October 10, 2013

లేవీయకాండము 19

Lev 19:1  మరియు యెహోవా మోషేకు ఈలాగు సెల విచ్చెనుఇశ్రాయేలీయుల సర్వసమాజముతో ఇట్లు చెప్పుము.
Lev 19:2  మీరు పరిశుద్ధులై యుండవలెను. మీ దేవుడనైన యెహోవానగు నేను పరిశుద్ధుడనై యున్నాను.
Lev 19:3  మీలో ప్రతివాడు తన తల్లికి తన తండ్రికి భయపడవలెను. నేను నియమించిన విశ్రాంతిదినములను ఆచరింపవలెను; నేను మీ దేవుడనైన యెహోవాను.
Lev 19:4  మీరు వ్యర్థమైన దేవతలతట్టు తిరుగకూడదు. మీరు పోతవిగ్రహములను చేసికొనకూడదు. నేను మీ దేవుడనైన యెహోవాను
Lev 19:5  మీరు యెహోవాకు సమాధానబలి అర్పించునప్పుడు అది అంగీ కరింపబడునట్లుగా అర్పింపవలెను.
Lev 19:6  మీరు బలినర్పిం చునాడైనను మరునాడైనను దాని తినవలెను. మూడవ నాటివరకు మిగిలియున్న దానిని అగ్నితో కాల్చివేయ వలెను.
Lev 19:7  మూడవనాడు దానిలో కొంచె మైనను తినినయెడల అది హేయమగును; అది అంగీకరింపబడదు.
Lev 19:8  దానిని తినువాడు తన దోషశిక్షను భరించును. వాడు యెహోవాకు పరిశుద్ధమైన దానిని అపవిత్రపరచెను. వాడు ప్రజలలోనుండి కొట్టివేయ బడును.
Lev 19:9  మీరు మీ భూమి పంటను కోయునప్పుడు నీ పొలము యొక్క ఓరలను పూర్తిగా కోయకూడదు; నీ కోతలో పరిగెను ఏరుకొనకూడదు; నీ ఫలవృక్షముల తోట పరిగెను కూర్చుకొనకూడదు;
Lev 19:10  నీ ఫలవృక్షముల తోటలో రాలిన పండ్లను ఏరుకొనకూడదు, బీదలకును పరదేశులకును వాటిని విడిచిపెట్టవలెను;
Lev 19:11  నేను మీ దేవుడనైన యెహోవాను. మీరు దొంగిలింపకూడదు, బొంకకూడదు, ఒకనితో ఒకడు అబద్ధమాడకూడదు;
Lev 19:12  నా నామమునుబట్టి అబద్ధప్రమా ణము చేయకూడదు; నీ దేవుని నామమును అపవిత్రపరచ కూడదు; నేను యెహోవాను.
Lev 19:13  నీ పొరుగువాని హింసింప కూడదు, వాని దోచుకొనకూడదు, కూలి వాని కూలి మరునాటి వరకు నీయొద్ద ఉంచుకొనకూడదు;
Lev 19:14  చెవిటివాని తిట్ట కూడదు, గ్రుడ్డివానియెదుట అడ్డమువేయకూడదు; నీ దేవునికి భయపడవలెను, నేను యెహోవాను.
Lev 19:15  అన్యాయపు తీర్పు తీర్చకూడదు, బీదవాడని పక్ష పాతము చేయకూడదు, గొప్పవాడని అభిమానము చూపకూడదు; న్యాయమునుబట్టి నీ పొరుగువానికి తీర్పు తీర్చవలెను.
Lev 19:16  నీ ప్రజలలో కొండెములాడుచు ఇంటింటికి తిరుగకూడదు, నీ సహోదరునికి ప్రాణ హానిచేయ చూడకూడదు, నేను యెహోవాను.
Lev 19:17  నీ హృదయములో నీ సహోదరుని మీద పగపట్టకూడదు, నీ పొరుగువాని పాపము నీ మీదికి రాకుండునట్లు నీవు తప్పక వానిని గద్దింపవలెను.
Lev 19:18  కీడుకు ప్రతికీడు చేయకూడదు, నీ ప్రజలమీద కోపముంచు కొనక నిన్నువలె నీ పొరుగు వానిని ప్రేమింపవలెను; నేను యెహోవాను.
Lev 19:19  మీరు నాకట్టడలను ఆచరింప వలెను; నీ జంతువులను ఇతర జాతిజంతువులను కలియ నీయకూడదు; నీ పొలములో వేరు వేరు జాతుల విత్తన ములు చల్లకూడదు; బొచ్చును నారయు కలిసినబట్ట వేసి కొనకూడదు.
Lev 19:20  ఒకనికి ప్రధానము చేయబడిన దాసి, వెలయిచ్చి విమోచింపబడకుండగానేమి ఊరక విడిపింప బడకుండగానేమి ఒకడు దానితో శయనించి వీర్యస్ఖలనము చేసినయెడల వారిని శిక్షింపవలెను. అది విడిపింపబడలేదు గనుక వారికి మరణశిక్ష విధింపకూడదు.
Lev 19:21  అతడు అపరాధ పరిహారార్ధబలిని, అనగా అపరాధపరిహారార్థబలియగు పొట్టేలును ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునకు యెహోవా సన్నిధికి తీసికొనిరావలెను.
Lev 19:22  అప్పుడు యాజ కుడు అతడు చేసిన పాపమునుబట్టి పాపపరిహారార్థబలియగు పొట్టేలువలన యెహోవా సన్నిధిని అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. దీనివలన అతడు చేసిన పాపము విషయమై అతనికి క్షమాపణ కలుగును.
Lev 19:23  మీరు ఆ దేశమునకు వచ్చి ఆహారమునకై నానా విధములైన చెట్లను నాటినప్పుడు వాటి పండ్లను అపవిత్రముగా ఎంచవలెను. వాటి కాపు మీకు ఎక్కువగా ఉండునట్లు అవి మూడు సంవత్సరములవరకు మీకు అపవిత్రముగా ఉండవలెను, వాటిని తిన కూడదు.
Lev 19:24  నాలుగవ సంవత్సరమున వాటి ఫలము లన్నియు యెహోవాకు ప్రతిష్ఠితమైన స్తుతియాగ ద్రవ్యములగును; అయిదవ సంవత్సరమున వాటి ఫలములను తినవచ్చును;
Lev 19:25  నేను మీ దేవుడనైన యెహోవాను.
Lev 19:26  రక్తము కూడినదేదియు తినకూడదు, శకునములు చూడ కూడదు, మంత్ర యోగములు చేయకూడదు,
Lev 19:27  మీ నుదుటి వెండ్రుకలను గుండ్రముగా కత్తిరింపకూడదు, నీ గడ్డపు ప్రక్కలను గొరగకూడదు,
Lev 19:28  చచ్చినవారికొరకు మీ దేహ మును చీరుకొనకూడదు, పచ్చబొట్లు మీ దేహమునకు పొడుచు కొనకూడదు; నేను మీ దేవుడనైన యెహోవాను.
Lev 19:29  మీ దేశము వ్యభిచరింపకయు దుష్కామ ప్రవర్తనతోనిండకయు ఉండునట్లు నీ కుమార్తె వ్యభి చారిణియగుటకై ఆమెను వేశ్యగా చేయకూడదు.
Lev 19:30  నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరింపవలెను నా పరిశుద్ధస్థలమును మన్నింపవలెను; నేను యెహోవాను.
Lev 19:31  కర్ణపిశాచిగలవారి దగ్గరకుపోకూడదు, సోదె గాండ్రను వెదకి వారివలన అపవిత్రత కలుగజేసికొనకూడదు; నేను మీ దేవుడనైన యెహోవాను.
Lev 19:32  తల నెరసినవాని యెదుట లేచి ముసలివాని ముఖమును ఘన పరచి నీ దేవునికి భయపడవలెను; నేను యెహోవాను.
Lev 19:33  మీ దేశమందు పరదేశి నీ మధ్య నివసించునప్పుడు వానిని బాధింపకూడదు,
Lev 19:34  మీ మధ్య నివసించు పరదేశిని మీలో పుట్టినవానివలె ఎంచవలెను, నిన్నువలె వానిని ప్రేమింప వలెను, ఐగుప్తుదేశములో మీరు పరదేశులై యుంటిరి; నేను మీ దేవుడనైన యెహోవాను.
Lev 19:35  తీర్పు తీర్చునప్పుడు కొలతలోగాని తూనికెలోగాని పరిమాణములోగాని మీరు అన్యాయము చేయకూడదు.
Lev 19:36  న్యాయమైన త్రాసులు న్యాయమైన గుండ్లు న్యాయమైన తూము న్యాయమైన పడి మీకుండవలెను; నేను ఐగుప్తుదేశములోనుండి మిమ్మును రప్పించిన మీ దేవుడనైన యెహోవాను.
Lev 19:37  కాగా మీరు నా కట్టడలన్నిటిని నా విధులన్నిటిని అనుసరించి నడుచుకొనవలెను; నేను యెహోవాను.

No comments:

Post a Comment